టీమిండియా సూపర్‌-8 మ్యాచ్‌లకు అంపైర్లు వీరే​​.. విలన్‌ ఉన్నాడు జాగ్రత్త..! | ICC Announces Umpires For T20 World Cup Super 8 | Sakshi
Sakshi News home page

టీమిండియా సూపర్‌-8 మ్యాచ్‌లకు అంపైర్లు వీరే​​.. విలన్‌ ఉన్నాడు జాగ్రత్త..!

Published Wed, Jun 19 2024 6:39 PM | Last Updated on Thu, Jun 20 2024 7:00 AM

T20 World Cup 2024: ICC Announced Field Umpires Names For Team India Super 8 Matches, Richard Kettleborough Will Be Umpiring In India Key Match Against Australia

టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే. సూపర్‌-8లో భారత్‌.. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలను ఢీకొట్టనుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లకు ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించే వారి పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్‌ 19) ప్రకటించింది. 

జూన్‌ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు రాడ్నీ టక్కర్‌, పాల్‌ రిఫిల్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. జూన్‌ 22న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు మైఖేల్‌ గాప్‌, ఆడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌.. జూన్‌ 24న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

విలన్‌ ఉన్నాడు జాగ్రత్త..!
సూపర్‌-8లో టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడబోయే కీలకమైన మ్యాచ్‌కు సీనియర్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. కెటిల్‌బరో పేరు వింటేనే భారత అభిమానులు ఉలిక్కిపడతారు. ఎందుకంటే  అతను అంపైర్‌గా వ్యవహరించిన అన్ని  ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. 

ఇప్పుడు అదే కెటిల్‌బరో సూపర్‌-8లో ఆసీస్‌తో కీలకమైన మ్యాచ్‌కు ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించనుండటంతో భారత క్రికెట్‌ అభిమానులు కలవపడుతున్నారు. భారత్‌ మరోసారి ఓడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌ టీమిండియాను ముందుగానే హెచ్చరిస్తున్నారు. విలన్‌ ఉన్నాడు జాగ్రత్త అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement