T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో..

T20 WC 2023: South Africa Creates History Face Australia In Final - Sakshi

ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు అలవాటే. పురుషులతో పాటు మహిళల టీమ్‌లోనూ ఇది చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు వీటికి ముగింపు పలుకుతూ దక్షిణాఫ్రికా మహిళల టీమ్‌ టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది.

పురుషుల, మహిళల జట్లను కలిపి చూస్తే ఏ ఫార్మాట్‌లోనైనా సఫారీ టీమ్‌(సీనియర్‌) ఐసీసీ టోర్నీలో ఫైనల్‌ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సొంతగడ్డపై లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన తర్వాత కోలుకున్న టీమ్‌ ఇప్పుడు తుది సమరానికి సిద్ధమైంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

బ్రిట్స్‌ హాఫ్‌ సెంచరీ
ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తజ్మీన్‌ బ్రిట్స్‌ (55 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లౌరా వాల్‌వర్ట్‌ (44 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 82 బంతుల్లో 96 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది.

నాట్‌ సీవర్‌ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (3/27), అయబొంగ ఖాక (4/29) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. షబ్నిమ్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, ఇంగ్లండ్‌ 6 పరుగులే చేయగలిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. కాగా భారత జట్టుతో జరిగిన తొలి సెమీస్‌లో గెలుపొంది ఆసీస్‌ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్‌ దూరం.. బీసీసీఐ ట్వీట్‌! గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌
Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌కు హర్మన్‌ కౌంటర్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top