అసలేమనుకుంటున్నారు? ఐసీసీ వీడియోపై కోహ్లి ఫ్యాన్స్‌ ఫైర్‌! కింగ్‌ రేంజ్‌ తెలుసు కాబట్టే ఇలా!

T20 WC 2022: Fans Fires On ICC Video Over Not Featuring Kohli - Sakshi

T20 World Cup 2022- Virat Kohli: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తీరుపై విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంకోసారి గనుక ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేస్తే మీ సోషల్‌ మీడియా అకౌంట్‌ను అన్‌ఫాలో చేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌-2022 నేపథ్యంలో ఐసీసీ ఇన్‌స్టా వేదికగా పలు వీడియోలు షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. ‘‘ఇండియా సిద్ధంగా ఉందా?’’ అంటూ ఓ షార్ట్‌ వీడియోను పంచుకుంది. అయితే, ఇందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, యజువేంద్ర చహల్‌ మాత్రమే కనిపించారు.  మరో వీడియోలోనూ రాహుల్‌, రోహిత్‌, సూర్య, చహల్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు మాత్రమే ఉన్నారు.

దీంతో కింగ్‌ కోహ్లి రాక కోసం ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అదే ఐసీసీపై వారి ఆగ్రహానికి కారణమైంది. ‘‘కోహ్లి అంటేనే రికార్డుల రారాజు. అతడు లేకుండా టీమిండియా ప్రోమోనా? అసలేమనుకుంటున్నారు? కోహ్లి వస్తాడని ఎంతగానో ఎదురుచూశాం. కానీ మమ్మల్ని పూర్తిగా నిరాశపరిచారు’’ అంటూ ఫైర్‌ అవుతున్నారు.

అయితే.. ‘‘మరికొంత మంది మాత్రం వీడియో ఇంకా పూర్తికాలేదు. కింగ్‌ కోసం మనం ఎదురుచూస్తామని తెలిసే.. ఇలా ఊరిస్తున్నారు. ఎంగేజ్‌ చేయడానికి ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారు. కోహ్లి రేంజ్‌ ఏంటో వాళ్లకు తెలుసు. అందుకే ఇలా భాయ్‌ని చూపించకుండా దాచిపెడుతున్నారు.

ఒకవేళ నిజంగానే వీడియోలో కోహ్లి లేనట్లయితే.. అది వాళ్లకే నష్టం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌-2022లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసి సత్తా చాటిన కోహ్లి వరల్డ్‌కప్‌-2022లోనూ ఇదే తరహాలో రాణించాలని అభిమానులు భావిస్తున్నారు.

చదవండి: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌ మాజీ కోచ్‌ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక
T20 World Cup 2022: సూపర్‌-12 మ్యాచ్‌లకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top