T20 WC 2022 ENG VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో ఇవాళ (నవంబర్ 1) అత్యంత కీలకమైన జరుగనుంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.
ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 3.850 రన్‌రేట్) సెమీస్ రేసులో ముందుండగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమితో 5 పాయింట్లు, -0.304 రన్‌రేట్), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు మరో ఓటమితో 3 పాయింట్లు, 0.239 రన్‌రేట్) జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
తుది జట్లు..
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధి, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
మీ అభిప్రాయం చెప్పండి
మరిన్ని వార్తలు