సూర్యకుమార్‌ బర్త్‌డే.. పృథ్వీ షా విషెస్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫొటో! | Surya Kumar Yadav Birthday Prithvi Shaw Shares Hilarious Photo | Sakshi
Sakshi News home page

Surya Kumar Yadav: పృథ్వీ షా విషెస్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫొటో!

Sep 14 2021 1:52 PM | Updated on Sep 14 2021 3:55 PM

Surya Kumar Yadav Birthday Prithvi Shaw Shares Hilarious Photo - Sakshi

Happy Birthday Suryakumar Yadav: టీమిండియా క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పుట్టినరోజు నేడు. మంగళవారంతో అతడు 31వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా క్రికెటర్‌ పృథ్వీ షా.. సూర్యను విష్‌ చేస్తూ షేర్‌ చేసిన ఓ హిలేరియస్‌ ఫొటో సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. రెండు జడలు, రిబ్బన్లు వేసుకుని స్కూల్‌ యూనిఫాంలో ఉన్నట్లుగా అతడి ఫొటోను ఎడిట్‌ చేసిన పృథ్వీ షా పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక ఇతర క్రికెటర్లు కుల్దీప్‌ యాదవ్‌, ముంబై ప్లేయర్లు రాహుల్‌ చహర్‌, అనుకుల్‌ రాయ్‌ కూడా సూర్యను విష్‌ చేశారు.కాగా సెప్టెంబరు 14, 1990లో ముంబైలో సూర్యకుమార్‌ జన్మించాడు. 2010-11 ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌తో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 

క్రీజులోకి వచ్చీ రావడంతోనే సిక్సర్‌ బాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో పరుగుల ఖాతా ఆరంభించాడు. అంతేకాదు అరంగేట్ర మ్యాచ్‌లోనే 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఇక జూలై 18, 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌.. వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇక సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌-2021 కోసం అతడు సన్నద్ధమవుతున్నాడు. వ్యక్తిగత విషయానికొస్తే.. సూర్యకుమార్‌కు 2016లో దేవిషా శెట్టితో వివాహం జరిగింది.

చదవండి: T20 World Cup 2021: ‘ఇండియా, పాకిస్తాన్‌.. ఇంకా సెమీస్‌ చేరే జట్లు ఇవే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement