
ముంబై: ఎంఎస్ ధోని అనూహ్య రిటైర్‌మైంట్‌తో దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ భావోద్వానికి లోనయ్యాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011లో ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోని ప్రత్యేక సిక్సర్‌తో ప్రపంచ కప్ అందించిన క్షణాన్ని క్రికెట్ అభిమానులు గుర్తించుకోవాలన్నారు. క్లిష్ట సమయాల్లోను కూల్‌గా వ్యవహరించి దేశానికి ఎన్నో కప్‌లు ధోని అందించాడని కొనియాడారు.
తాను చనిపోయే ముందు ప్రపంచకప్(2011) ఫైనల్‌లో ధోని బాదిన చివరి సిక్సర్‌ను చూసి చనిపోతే ఎంతో సంతోషిస్తానని గావస్కర్ తెలిపారు. ఓ సందర్భంలో ధోనిని కలిసినప్పుడు ఈ విషయాన్ని అతనితో చెప్పానని.. ధోని ఏమి మాట్లాడలేదని, నవ్వుతూ కనిపించాడని గావస్కర్ పేర్కొన్నారు. టీమిండియా కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోపీ తదితర ఎన్నో ముఖ్య టోర్నిల్లో దేశానికి ధోని విజయాలు అందించిన విషయం తెలిసిందే.
చదవండి: గావస్కర్ తర్వాత రో‘హిట్’