భారత్‌దే ‘శాఫ్‌’ ఫుట్‌బాల్‌ టైటిల్‌

 Sunil Chhetri Equals Lionel Messi Feat As Blue Tigers Win 8th Title - Sakshi

మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. నేపాల్‌ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున సునీల్‌ ఛెత్రి (49వ ని.లో), సురేశ్‌ సింగ్‌ (50వ ని.లో), అబ్దుల్‌ సమద్‌ (90వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్‌ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్‌ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్‌)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌–115 గోల్స్‌) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top