స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన పవన్ రత్నాయకే(121)కు టీ20 జట్టులో కూడా చోటు దక్కింది.
సీనియర్ బ్యాటర్ కుశాల్ పెరీరాకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. పేలవమైన ప్రదర్శన కారణంగా పేసర్ నువాన్ తుషార, ఆల్ రౌండర్ కమిందు మెండిస్, లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతలపై సెలెక్టర్లు వేటు వేశారు. వీరి ముగ్గురు శ్రీలంక టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులే దాదాపుగా శ్రీలంక టీ20 ప్రపంచ కప్ ఫైనల్ స్క్వాడ్‌లో ఉండే అవకాశం ఉంది. శ్రీలంక సెలెక్టర్లు మరోసారి స్పిన్నర్లపై నమ్మకం ఉంచారు. ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలాగేలు స్పిన్నర్లగా చోటు దక్కించుకున్నారు.
పేస్ విభాగంలో మతీష పతిరణ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, ఈషన్ మలింగ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ఇక ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరగనుంది. జనవరి 30 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
ఇంగ్లండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టు
దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిశ్రా, కుసల్ మెండిస్, కుసల్ జనిత్ పెరీరా, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, జనిత్ లియానగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, మతీష పతిరణ, ఈషన్ మలింగ, దుష్మంత చమీర


