SL vs IRE: చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్‌ రికార్డు బద్దలు

Sri Lanka spinner prabath Jayasuriya breaks 71 year old Test record - Sakshi

టెస్టు క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్‌ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌తో పాల్‌ స్టిర్లింగ్‌ను ఔట్‌ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్‌ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్‌ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్‌ మాజీ స్పిన్నర్‌ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు.  వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు.  తాజా మ్యాచ్‌తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును  ప్రబాత్ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు.

చదవండిIPL 2023-Teamindia: కిషన్‌ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌! విధ్వంసం సృష్టిస్తాడు..

అదే విధంగా ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ టామ్ రిచర్డ్‌సన్‌తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్‌ మాత్రమే సాధించాడు.
చదవండిIPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top