సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్-2026 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆడే తొలి హోం గ్రౌండ్ మ్యాచ్ టికెట్లపై అప్‌డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 7న ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆరెంజ్ ఆర్మీ తలపనుంది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను గురువారం(మార్చి 26) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. అభిమానులు డిస్ట్రిక్ యాప్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లకు ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ఫ్రీగా పొందొచ్చు.
అయితే బీసీసీఐ తొలుత కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలి విడతలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ హోం గ్రౌండ్‌లో ఆడనుంది. ఇక ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు.
దీంతో అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ జట్టు పగ్గాలను చేపట్టాడు. ఎస్ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది. ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న సన్‌రైజర్స్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.
చదవండి: IPL 2026: ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. టికెట్లు బుకింగ్ ఎప్పటినుంచి అంటే?


