ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్దానాన్ని ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేయిన్‌తో ఎస్‌ఆర్‌హెచ్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్‌ను రూ.1.5 కోట్లకే సన్‌రైజర్స్ దక్కించుకుంది. కాగా 26 ఏళ్ల డేవిడ్ పేయిన్ ఇంగ్లండ్ తరపున కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ అతడికి టీ20ల్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు 233 టీ20లు ఆడి 304 వికెట్లు పడగొట్టాడు.
బిగ్ బాష్ లీగ్, ది హాండ్రడ్, ఇంటర్ననేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం అతడికి ఉంది. ఈ క్రమంలోనే అతడిని ఆరెంజ్ ఆర్మీ జట్టులోకి తీసుకుంది. అతడి రాకతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.
ఎషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్‌తో పేయిన్ బంతిని పంచుకోనున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఫిట్‌నెస్ సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌కు ఇక తిరుగులేనిట్లే. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
ఎస్ఆర్‌హెచ్ జట్టు
బ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్
ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి
బౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి


