క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజ పరాజయం  | Sreeja lost in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజ పరాజయం 

Jan 28 2024 3:25 AM | Updated on Jan 28 2024 3:25 AM

Sreeja lost in the quarter final - Sakshi

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. గోవాలో శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజ 5–11, 11–7, 6–11, 4–11తో చెంగ్‌ ఐ చింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. శ్రీజకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ, 105 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement