35వ వసంతంలోకి 'కింగ్‌ కోహ్లి'.. పుట్టిన రోజున సచిన్‌ రికార్డు సమం చేసేనా..? | Special Story On Virat Kohli On Occasion Of His Birthday | Sakshi
Sakshi News home page

CWC 2023: 35వ వసంతంలోకి 'కింగ్‌ కోహ్లి'.. పుట్టిన రోజున సచిన్‌ రికార్డు సమం చేసేనా..?

Published Sun, Nov 5 2023 12:42 PM | Last Updated on Sun, Nov 5 2023 3:53 PM

Special Story On Virat Kohli On Occasion Of His Birthday - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇవాళ 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 1988 నవంబర్‌ 5న న్యూఢిల్లీలో జన్మించిన విరాట్‌ అంచలంచలుగా ఎదుగుతూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా కీర్తించబడుతున్నాడు.

చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే అమితమైన ఆసక్తి కలిగిన విరాట్‌.. ఈ క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.

రికార్డుల రారాజు, ఛేజింగ్‌ మాస్టర్‌, పరుగుల యంత్రం, క్రికెట్‌ కింగ్‌గా పేరొందిన విరాట్‌.. 2008 అండర్ 19 ప్రపంచ కప్‌ విజయంతో (భారత కెప్టెన్‌గా) తొలిసారి వెలుగులోకి వచ్చాడు.

నాటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ పరుగుల యంత్రం క్రికెట్‌లో సాధించాల్సినవన్నీ దాదాపుగా సాధించాడు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆటలో మరింత పదును పెంచుకుంటూపోతున్న కింగ్‌.. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

కొంతకాలం కిందట కెరీర్‌లో హీన దశను (దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేక) ఎదుర్కొన్న ఈ ఛేజింగ్‌ మాస్టర్‌.. ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌ల్లో సెంచరీ, 4 అర్ధసెంచరీల సాయంతో 88.40 సగటున 442 పరుగులు చేసిన ఈ రికార్డుల రారాజు.. ఇవాళ సౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ పేరిట ఉన్న అత్యుత్తమ రికార్డును (వన్డేల్లో అత్యధిక సెంచరీలు (49)) సమం చేయాలని పట్టుదలగా ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌.. సచిన్‌ రికార్డును సమం చేయడంతో పాటు టోర్నీలో టీమిండియాకు వరుసగా ఎనిమిదో విజయాన్ని అందించాలని అశిద్దాం.  

కోహ్లి జీవితంలో కీలక ఘట్టాలు..

 • 15 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి ఎంట్రీ
 • బాల్‌ బాయ్‌గా ప్రస్తానం​ మొదలు
 • భారత సారధిగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలుపు (2008)
 • రంజీ మ్యాచ్‌ ఆడే సమయంలో తండ్రి మరణం.. బాధను దిగమింగుతూ తన జట్టును ఒంటి చేత్తో గెలిపించిన వైనం
 • 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం
 • 2011 వరల్డ్‌కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడు
 • 2014లో భారత జట్టు కెప్టెన్‌గా నియామకం
 • టెస్ట్‌ల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 జట్టుగా నిలిపాడు
 • తన సారథ్యంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న అపవాదు
 • 2017 డిసెంబర్‌ 11న బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో వివాహం
 • 2021 జనవరి 11న కుమార్తె వామిక జననం
 • బీసీసీఐతో విభేదాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం
 • సెంచరీ కోసం మూడేళ్ల నిరీక్షణ
 • ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌గా అవార్డు
 • ఇవే కాకుండా ఎన్నో రికార్డులు, అవార్డులు, పురస్కారాలు
 • తాను సొంతంగా ఫిట్‌నెస్ స్థాయిలను మెరుగుపరచుకోవడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఫిట్‌నెస్ ప్రామాణికంగా నిలిచాడు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement