
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అదే జోరును కొనసాగిస్తోంది. మంగళవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
ఇంగ్లీష్ జట్టు నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 20.5 ఓవర్లలో చేధించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ ఐడైన్ మార్‌క్రమ్ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు.
కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్‌క్రమ్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(31) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా విఫలమయ్యారు.
మహారాజ్ విజృంభణ..
అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 24.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముల్డర్ మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ జేమీ స్మిత్(54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.