
కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఏదో ఒక అంశం గంగూలీని టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్ కమిటీ వ్యవహారాల్లో గంగూలీ తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు విరాట్ కోహ్లి, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో కలిసి గంగూలీ సమావేశమైన ఫోటో ఒకటి చక్కర్లు కొట్టింది.
చదవండి: Australia Tour Of Pakistan: 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపై సిరీస్
ఈ వార్తలను బీసీసీఐ బాస్ గంగూలీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. తాను బీసీసీఐకి బాస్‌నని.. ఇలాంటి తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గంగూలీ ఘూటు విమర్శలు చేశాడు.''నేను బీసీసీఐకి అధ్యక్షుడి హోదాలో ఉన్నా. అలాంటి గొప్ప స్థానంలో ఉన్నా నాకు పిచ్చి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఒక బీసీసీఐ బాస్‌గా నా పనేంటో తెలుసు. ప్రస్తుతం అదే చేస్తున్నా. సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో నా ఫోటోను పెట్టి నిబంధనలు అతిక్రమించాడని ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. సెక్రటరీ జై షా, విరాట్ కోహ్లితో కలిసి ఫోటో దిగినంత మాత్రానా నేను సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరైనట్లు ఎలా చెప్పగలరు. అది బయటో ఎక్కడో కలిసిన సందర్భంలో తీసిన ఫోటో అని భావించొచ్చు కదా.. అయినా ఇలాంటి పిచ్చి ఆరోపణలు నాకు అవసరం లేదు. టీమిండియా తరపున 424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నాకు రూల్స్ ఏంటనేవి తెలియవా'' అంటూ విరుచుకుపడ్డాడు.
చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..