SL vs NZ: ప్రత్యర్థులకు దడ పుట్టించే లంక బౌలర్‌ ఎంట్రీ! | SL vs NZ 2024 Uncapped Nishan Peiris Replaces injured Vishwa Fernando | Sakshi
Sakshi News home page

కివీస్‌తో లంక రెండో టెస్టు.. అన్‌క్యాప్డ్‌ బౌలర్‌ ఎంట్రీ!

Sep 24 2024 2:16 PM | Updated on Sep 24 2024 2:56 PM

SL vs NZ 2024 Uncapped Nishan Peiris Replaces injured Vishwa Fernando

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందరర్భంగా శ్రీలంక ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కి జట్టులో చోటిచ్చింది. విశ్వ ఫెర్నాండో గాయపడిన కారణంగా అతడి స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ నిషాన్‌ పెరిస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. గాలె వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో లంక కివీస్‌ను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు
లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య (4/136; 5/68) స్పిన్‌ మాయాజాలం కారణంగా శ్రీలంకకు ఈ విజయం సాధ్యమైంది. ఇక ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నిషాన్‌ పెరిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లుశ్రీలంక బోర్డు తెలిపింది.

33 ఏళ్ల విశ్వ ఫెర్నాండో ప్రాక్టీస్‌ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడని.. అతడిస్థానాన్ని నిషాన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా నిషాన్‌కు 2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అకిల ధనుంజయ గాయపడటంతో మూడో మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేశారు.

ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనత
కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలోనూ జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కూడా అరంగేట్రం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా నిషాన్‌ పెరిస్‌ 41 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 172 వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనత సొంతం చేసుకున్నాడు.

ఇందులో 12సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇక 61 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. ఒకవేళ నిషాన్‌ను‌ గనుక తుదిజట్టులోకి ఎంపిక చేస్తే మరో భయంకర స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు కివీస్‌ సిద్ధపడాల్సిందే!

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు శ్రీలంక జట్టు
దిముత్ కరుణరత్నే, పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్ (వికెట్‌ కీపర్‌), దినేశ్‌ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్‌), కమిందు మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, మిలన్ ప్రియనాథ్ రాత్నాయక్, సదీర సమరవిక్రమ, జెఫ్రీ వాండర్సే, ఓషద ఫెర్నాండో, నిషాన్‌ పెరిస్‌.

చదవండి: మోర్నీ పనికిరాడన్నట్లు చూశారు.. తామే గొప్ప అనుకుంటారు: పాక్‌ మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement