అలా అయితే, తప్పక రాజకీయాల్లోకి వస్తా.. శిఖర్‌ ధవన్‌ సంచలన స్టేట్‌మెంట్‌

Shikhar Dhawan Opens Up On Joining Politics - Sakshi

గత కొద్ది రోజులుగా ఏదో విషయంతో వార్తల్లో నిలుస్తున్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌.. తాజాగా మరో ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ద్వారా క్రికెట్‌తో పాటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ హీట్‌ పుట్టించాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన గబ్బర్‌.. భగవంతుడి చిత్తమై, తన విధిలో రాసిపెట్టివుంటే, తప్పక రాజకీయాల్లోకి వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీలో పుట్టిపెరిగిన 37 ఏళ్ల ధవన్‌ రాజకీయాలపై తన మనసులో మాట బయటపెట్టడంతో పొలిటికల్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ధవన్‌ ఏ పార్టీలో చేరాడు, ఏ పార్టీతో టచ్‌లో ఉన్నాడు, ఏ పార్టీలో చేరకపోతే ఎవరు అతనికి గాలం వేస్తున్నారు..? ఇలా రకరకాల డిస్కషన్లతో  గబ్బర్‌ అభిమానులు నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు.

అయితే గబ్బర్‌ తన పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన వెంటనే మరో విషయం కూడా స్పష్టం చేశాడు. ఇప్పటికైతే రాజకీయాలపై తనకు ఎలాంటి ప్లాన్‌లు లేవని, తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావడం దేవుడి చిత్తమైతే అందులోనూ వంద శాతం ఎఫర్ట్‌ పెట్టి సక్సెస్‌ సాధిస్తానని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2023 ప్రారంభానికి ముందు ఇలాంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గబ్బర్‌.. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 16వ ఎడిషన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు సారధ్యం వహించనున్నాడు.

కాగా, గత కొద్ది రోజులుగా ఏదో ఓ ఆసక్తికర స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలుస్తున్న ధవన్‌.. తొలుత చెడిన తన ఫ్యామిలీ లైఫ్‌పై స్పందించాడు. ఆతర్వాత తానే సెలెక్టర్‌నైతే, ఓపెనర్‌గా తన కంటే శుభ్‌మన్‌ గిల్‌ బెటర్‌ అని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే, టాటూ వేయించుకున్నందుకు హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నానని చెప్పాడు. తాజాగా రాజకీయాలపై తన మనసులో మాటను బయటపెట్టి వార్తల్లో హెడ్‌లైన్‌గా మారాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 1న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-2023 జర్నీ ప్రారంభిస్తుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top