Shaun Tait: ఆఫ్గనిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌

Shaun Tait Appointed As Afghanistan Bowling Coach For 5 Months Period - Sakshi

కాబుల్‌: ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షాన్‌ టైట్‌ ఆఫ్గనిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఐదు నెలల కాలానికిగానూ టైట్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు ఆఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.  అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టైట్‌ను నియమించినట్లు పేర్కొంది. కాగా షాన్‌ టైట్‌ ముందు పెద్ద సవాల్లే ఉన్నాయి. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ మొదలుకొని.. ఆ తర్వాత శ్రీలంక పర్యటన.. అటుపై టీ20 ప్రపంచకప్‌ కీలకంగా ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్గనిస్తాన్‌ జట్టు ఉన్న గ్రూఫ్‌లోనే ఇండియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన జట్లు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్‌ తర్వాత నవంబర్‌ 27నుంచి హోబర్ట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. 

ఇక 2005లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షాన్‌టైట్‌ తరచూ గాయాల బారీన పడుతూ జట్టులో నిలకడగా కొనసాగలేకపోయాడు. ఆసీస్‌ తరపున 3 టెస్టుల్లో 5 వికెట్లు, 35 వన్డేల్లో 62 వికెట్లు, 21 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. ఇక 2007 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో షాన్‌ టైట్‌ సభ్యుడిగా ఉన్నాడు. అంతేగాక ఆ వరల్డ్‌ కప్‌లో 23 వికెట్లు తీసి ఆసీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top