breaking news
Shaun Tait
-
బంగ్లాదేశ్ కోచ్‌గా అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్
బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 42 ఏళ్ల మాజీ ఫాస్ట్ బౌలర్ 2027 నవంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. టైట్ తన కోచింగ్ ప్రయాణంలో పాకిస్తాన్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు సేవలందించాడు. టైట్.. 2007లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలో 59 మ్యాచ్‌లు ఆడిన టైట్.. 95 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ నియామకంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన ఆండ్రీ ఆడమ్స్ వైదొలిగాడు. ఆడమ్స్ గతేడాది మార్చిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆడమ్స్ ఆథ్వర్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనలు చేసింది. ఈ కారణంగా అతనిపై వేటు పడింది.క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్షాన్ టైట్ పేరిట క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డు నమోదై ఉంది. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. టైట్‌తో పాటు మరో ఆసీస్ పేసర్ బ్రెట్ లీ కూడా 161.1కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ ఈ వేగాన్ని అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో నాలుగో వేగవంతమైన డెలివరీ రికార్డు కూడా ఆసీస్‌కే చెందిన జెఫ్ థాంప్సన్ పేరిట ఉంది. థామ్సన్ 1975-76 సిరీస్‌లో విండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 160.6కిమీ వేగంతో బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలో ఐదో వేగవంతమైన బంతి రికార్డు కూడా ఆసీస్ పేసర్ పేరిటే ఉంది. 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టార్క్ 160.4కిమీ వేగంతో బంతిని సంధించాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ జట్టు మే 17 నుంచి యూఏఈలో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లా టీమ్ యూఏఈతో రెండు టీ20లు (మే 17, 19) ఆడనుంది. అనంతరం మే 25 నుంచి బంగ్లా జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌తో యుద్దం తర్వాత పాక్‌లో జరగాల్సిన ఈ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. -
మ్యాక్స్‌వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు
Maxwell Lists His Top Five T20 Players Ahead Of T20 WC 2021: పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, విశ్లేషకులు తమతమ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్ డాషింగ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం ప్రపంచ టీ20 జట్టుకు తన ఐదుగురు ఫేవరెట్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించాడు. ఈ జాబితాలో మ్యాక్సీ అనూహ్యంగా ఇద్దరు ఆసీస్ వెటరన్ ప్లేయర్స్‌కు చోటు కల్పించడం విశేషం. తన ఫస్ట్ ఛాయిస్ ఆటగాడిగా అఫ్గాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేసిన మ్యాక్స్‌వెల్.. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్, విండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసెల్‌లను తన జట్టులోకి ఎంపిక చేశాడు. అయితే వికెట్‌కీపర్ కోటాలో అతను అనూహ్యంగా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చోటు కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆఖరుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్‌ను మ్యాక్సీ తన జట్టులోని తీసుకున్నాడు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్ధులని, అందుకే వీరిని తన జట్టులోకి ఎంపిక చేశానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. చదవండి: పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్ Two all-rounders, a leg-spinning sensation and two Australians of the past 🏏 Glenn Maxwell’s top five T20 Players 🎥 pic.twitter.com/Yn2lUsCgE4 — T20 World Cup (@T20WorldCup) October 6, 2021 -
Shaun Tait: ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్
కాబుల్: ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఐదు నెలల కాలానికిగానూ టైట్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టైట్‌ను నియమించినట్లు పేర్కొంది. కాగా షాన్ టైట్ ముందు పెద్ద సవాల్లే ఉన్నాయి. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలుకొని.. ఆ తర్వాత శ్రీలంక పర్యటన.. అటుపై టీ20 ప్రపంచకప్ కీలకంగా ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్గనిస్తాన్ జట్టు ఉన్న గ్రూఫ్లోనే ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్ తర్వాత నవంబర్ 27నుంచి హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇక 2005లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్టైట్ తరచూ గాయాల బారీన పడుతూ జట్టులో నిలకడగా కొనసాగలేకపోయాడు. ఆసీస్ తరపున 3 టెస్టుల్లో 5 వికెట్లు, 35 వన్డేల్లో 62 వికెట్లు, 21 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. ఇక 2007 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో షాన్ టైట్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేగాక ఆ వరల్డ్ కప్‌లో 23 వికెట్లు తీసి ఆసీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
క్రికెట్ కు షాన్ టెయిట్ గుడ్ బై
సిడ్నీ: ప్రపంచ క్రికెట్ ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. కాంపిటేటివ్ స్థాయి క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన వయసు పైబడటంతో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు 34 ఏళ్ల షాన్ టెయిట్ తెలిపాడు. ' నిజాయితీగా చెప్పాలంటే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలనుకున్నా. ఇక్కడ(ఆస్ట్రేలియా)లో కానీ, యూకేలో కానీ క్రికెట్ కెరీర్ ను కొనసాగించాలనుకున్నా. అయితే ప్రస్తుతం క్రికెట్ లో పోటీ తత్వం బాగా పెరిగింది. యువ క్రికెటర్లు చాలా మందే వచ్చారు. వారితో పోటీ పడటం కాస్త కష్టంగానే ఉంది. అందుచేత క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకాలనుకున్నా'అని టెయిట్ తెలిపాడు. 2016-17 సీజన్ లో భాగంగా బిగ్ బాష్ లీగ్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడిన టెయిట్.. చివరిసారి సిడ్నీ థండర్ తో జరిగిన మ్యాచ్ లో కనిపించాడు. ఇదిలా ఉంచితే భారత్ తో సిడ్నీలో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ అతనికి ఆస్ట్రేలియా తరపున ఆఖరి మ్యాచ్. 2005లో ఇంగ్లండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ తో టెయిట్ తన అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. అయితే తన టెస్టు కెరీర్ లో మూడు మ్యాచ్ లను మాత్రమే టెయిట్ ఆడాడు. కాగా, టెయిట్ వన్డే కెరీర్ మాత్రం ఆశాజనకంగానే సాగింది. తన వన్డే కెరీర్ లో 35 మ్యాచ్ లు ఆడి 62 వికెట్లు తీశాడు. 2007 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో టెయిట్ ది కీలక పాత్ర. ఆ వరల్డ్ కప్ 11 మ్యాచ్ ల్లో 23 వికెట్లు సాధించి టోర్నమెంట్ లో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉండగా, 2010లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 161.1 కి.మీ వేగంతో ఫాస్టెస్ బంతిని వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. -
భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్
ముంబై: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ముంబైలోనే జరిగిన ఈ పెళ్లికి భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు. -
భారత మోడల్‌ను పెళ్లాడనున్న టెయిట్
లండన్: ఐపీఎల్ పార్టీ ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ షాన్ టెయిట్, భారత మోడల్ మషూమ్ సింఘాలను ఒక్కటి చేసింది. త్వరలో వీరి వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ముంబైకి చెందిన 29 ఏళ్ల మషూమ్ స్విమ్‌సూట్ మోడల్. 2005 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన ఫొటో షూటింగ్లో పాల్గొన్నది. అయితే వీరిద్దరి మధ్య తొలి పరిచయం మాత్రం 2010లో ఓ ఐపీఎల్ పార్టీలో జరిగింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి... ఇప్పుడు పెళ్లిదాకా వచ్చింది.