మ్యాక్స్‌వెల్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు

T20 World Cup 2021: Glenn Maxwell Lists His Top Five T20 Players - Sakshi

Maxwell Lists His Top Five T20 Players Ahead Of T20 WC 2021: పొట్టి ప్రపంచకప్‌ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, విశ్లేషకులు తమతమ ఛాయిస్‌ ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌ డాషింగ్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సైతం ప్రపంచ టీ20 జట్టుకు తన ఐదుగురు ఫేవరెట్‌ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించాడు. ఈ జాబితాలో మ్యాక్సీ అనూహ్యంగా ఇద్దరు ఆసీస్‌ వెటరన్‌ ప్లేయర్స్‌కు చోటు కల్పించడం విశేషం. తన ఫస్ట్‌ ఛాయిస్‌ ఆటగాడిగా అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎంపిక చేసిన మ్యాక్స్‌వెల్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌, విండీస్‌ విధ్వంసకర ప్లేయర్‌ ఆండ్రీ రసెల్‌లను తన జట్టులోకి ఎంపిక చేశాడు.

అయితే వికెట్‌కీపర్‌ కోటాలో అతను అనూహ్యంగా దిగ్గజ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు చోటు కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆఖరుగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాన్‌ టైట్‌ను మ్యాక్సీ తన జట్టులోని తీసుకున్నాడు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సమర్ధులని, అందుకే వీరిని తన జట్టులోకి ఎంపిక చేశానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
చదవండి: పేలవ డ్రాగా ముగిసిన పింక్‌ బాల్‌ టెస్ట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top