ఐపీఎల్‌ నుంచి షమీ అవుట్‌   | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నుంచి షమీ అవుట్‌  

Published Fri, Feb 23 2024 4:14 AM

Shami out of IPL - Sakshi

భారత పేస్‌ బౌలర్‌  షమీ ఎడమ కాలి మడమ గాయం కారణంగా ఐపీఎల్‌–2024 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో లండన్‌లో ఈ గాయానికి చికిత్స తీసుకునే క్రమంలో మడమకు అతను ప్రత్యేక ఇంజక్షన్‌లు తీసుకున్నాడు.

అయితే అవి ప్రభావం చూపించకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకోవడం తప్పనిసరిగా మారింది. త్వరలోనే అతను మళ్లీ లండన్‌కు వెళతాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో 24 వికెట్లతో భారత్‌ను ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన షమీ ఆ తర్వాత మరే మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు.

Advertisement
 
Advertisement