FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్‌ 'డ్రా'

Serbia and Cameroon play out thrilling 3 3 draw in Group G - Sakshi

ఫిపా ప్రపంచకప్‌-2022 గ్రూప్‌ జిలో భాగంగా కామెరూన్, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్‌ వర్షం కురిసింది. ఇరు జట్లు చెరో మూడు గోల్స్‌ సాధించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్‌ వచ్చి చేరింది. మ్యాచ్‌ 28వ నిమిషంలో చార్లెస్ కాస్టెల్లెట్‌ కామెరూన్‌కు తొలి గోల్‌ను అందించాడు. తొలి భాగంలో  గోల్‌ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించిన సెర్బియా.. కామెరూన్ డిఫెన్స్‌ ముందు తలవంచింది.

అయితే ఫస్ట్‌ హాఫ్‌లో మ్యాచ్‌ రిఫరీ 6 నిమిషాల అదనపు సమయం కేటాయించాడు. ఈ సమయంలో సెర్బియా ఆనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఒక్క సారిగా సెర్బియా  ఆధిక్యంలో వచ్చింది. (45+1వ నిమిషంలో) పావ్లోవిచ్ సెర్బీయా తరపున తొలి గోల్‌ సాధించగా.. మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో) మరో గోల్‌ను సాధించాడు.

దీంతో మ్యాచ్‌ తొలి భాగం ముగిసే సరికి  2-1తో దిక్యంలో సెర్బియా నిలిచింది. రెండో భాగంలో సెర్బియా తన జోరును కోనసాగించింది.  53వ నిమిషంలో మిత్రోవిచ్ సెర్బియాకు మరో గోల్‌ను అందించి తిరుగులేని అధిక్యంలో నిలిపాడు.

ఇక అంతా సెర్బియాదే విజయం అని భావించారు. ఈ సమయంలో కామెరూన్ అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. వరుసగా రెండు గోల్స్‌ను  సాధించి సెర్బియాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. కాగా సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన విన్సెంట్ అబుబకర్ (63 నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) గోల్స్‌ సాధించి కామెరూన్ హీరోలుగా నిలిచారు.
చదవండిChristiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్‌ .. ఏడాదికి రూ.612 కోట్లు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top