శ్రమించి గెలిచిన సాత్విక్‌ – చిరాగ్‌ జోడీ | Satwiksairaj-Chirag Shetty Survive Scare At Thailand Open | Sakshi
Sakshi News home page

శ్రమించి గెలిచిన సాత్విక్‌ – చిరాగ్‌ జోడీ

May 13 2026 2:20 AM | Updated on May 13 2026 2:20 AM

Satwiksairaj-Chirag Shetty Survive Scare At Thailand Open

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–23, 21–10తో ఎర్వియాన్‌సియా–మౌలానా (ఇండోనేసియా) జంటపై శ్రమించి గెలిచింది.

64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న భారత జోడీ నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గూన్‌టింగ్‌– హైకల్‌ (మలేసియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement