పసికూనపై ప్రతాపం.. సెమీస్‌లో భారత్‌ | SAFF U17 Women Football: India Thrash Maldives 9-0, Make It To Semifinal | Sakshi
Sakshi News home page

SAFF U17 Womens Football: పసికూనపై ప్రతాపం.. సెమీస్‌లో భారత్‌

Sep 11 2022 11:58 AM | Updated on Sep 11 2022 11:58 AM

SAFF U17 Women Football: India Thrash Maldives 9-0, Make It To Semifinal - Sakshi

కఠ్మాండు (నేపాల్‌): దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 9–0 గోల్స్‌ తేడాతో పసికూనలైన మాల్దీవుల జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ (55వ ని.లో) ఒక గోల్‌... అంజు తమాంగ్‌ నాలుగు గోల్స్‌ (24వ ని.లో, 45+2వ ని.లో, 85వ ని.లో, 88వ ని.లో)... డాంగ్మే గ్రేస్‌ (53వ ని.లో, 86వ ని.లో) రెండు గోల్స్‌.. కష్మీనా (84వ ని.లో) ఒక గోల్‌ సాధించారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో 13న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement