బోపన్న జోడీకి షాక్‌ | Rohan Bopanna couple is disappointed | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీకి షాక్‌

Mar 1 2024 4:20 AM | Updated on Mar 1 2024 4:20 AM

Rohan Bopanna couple is disappointed - Sakshi

దుబాయ్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీలో ఈ జోడీ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.

పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–3, 3–6, 8–10తో బెహర్‌ (ఉరుగ్వే)–పావ్లాసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) జంట చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.  

యూకీ–హాస్‌ జంట సంచలనం 
మరోవైపు ఇదే టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జంట సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో యూకీ–హాస్‌ జోడీ 6–4, 7–6 (7/1)తో మూడో సీడ్‌ జేమీ ముర్రే (బ్రిటన్‌)–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జంటను బోల్తా కొట్టించింది. 

Advertisement
 
Advertisement
Advertisement