Rishabh Pant Health: ప్లాస్టిక్‌ సర్జరీ?! పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..

Rishabh Pant Accident: Dehradun Hospital Update On India Star Health - Sakshi

Rishabh Pant Accident- Health Update: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ఆరోగ్యంపై డెహ్రాడూన్‌ వైద్యులు స్పందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన పంత్‌కు డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. 

యాక్సిడెంట్‌లో పంత్‌ తల, కాలికి గాయాలు అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతడికి చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని ఓ డాక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చర్‌ అయింది. ఆర్థోపెడిక్‌,  ప్లాస్టిక్‌ సర్జరీ చేయాల్సి రావొచ్చు’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 

మెరుగైన వైద్యం
కాగా ఉత్తరాఖండ్‌ అంబాసిడర్‌ పంత్‌ ప్రమాద ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి.. అతడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదృష్టవశాత్తూ పంత్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడని.. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రాణాలతో బయటపడ్డాడు
డివైడర్‌ను ఢీకొన్న ప్రమాద ఘటనలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 25 ఏళ్ల రిషభ్‌ పంత్‌ చాకచక్యంగా వెంటనే కారులో నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ విచారకర ఘటనపై స్పందించిన క్రీడా ప్రముఖులు, అభిమానులు పంత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌ పర్యటన ముగించుకున్న రిషభ్‌ పంత్‌కు స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో విశ్రాంతినిచ్చారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Rishabh Pant: ఉదయమే పంత్‌ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా
Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్‌.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్‌ అంటే కేవలం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top