టీమిండియాకు ఇంకా క్లారిటీ లేదు: పాంటింగ్‌

Ricky Ponting Shoots Some Vital Questions For India - Sakshi

సిడ్నీ: మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరుగునున్న ద్వైపాక్షిక సిరీస్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌-13వ సీజన్‌తో బాగా ఎంజాయ్‌ చేసిన అభిమానులు..కొద్ది విరామం తర్వాత ఆస్ట్రేలియాతో భారత్‌ జట్టు సిరీస్‌ ఆడటం మరింత మజాను తీసుకురానుంది.  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ నెల 27వ తేదీన మొదటి వన్డేతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌ తర్వాత టీ20 సిరీస్‌, టెస్టు సిరీస్‌లు జరుగనున్నాయి. కాగా, టీమిండియాతో వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి బయల్దేరతాడు.  కోహ్లి భార్య అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో.. టీమిండియా కెప్టెన్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి గైర్హాజరీ తర్వాత జట్టు కెప్టెన్‌ ఎవరనే దానిపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టెస్టు వైస్‌ కెప్టెన్‌గా ఉ‍న్న రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. (క్రికెటర్‌ సిరాజ్‌ తండ్రి కన్నుమూత)

అయితే కోహ్లి గైర్హాజరీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంటున్నాడు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌. తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లిపోతే ఆ స్థానాన్ని పూడ్చడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. 'విరాట్‌ కోహ్లీ వెళ్లిపోతే టీమిండియా ఇబ్బంది పడుతుంది. అతడి బ్యాటింగ్‌, నాయకత్వం లేకపోవడం ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అలా అయితే అది అతడిపైనా అదనపు ఒత్తిడినే పెంచుతుంది. కీలకమైన నాలుగో స్థానంలో ఆడే కొత్త బ్యాట్స్‌మన్‌ను వారు గుర్తించాలి. తొలి టెస్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పైనే వారికింకా స్పష్టత లేదనుకుంటున్నా. ఎవరు ఓపెనింగ్‌ చేయాలి?, కోహ్లి వెళ్తే నాలుగో స్థానంలో ఎవరు? వంటివి ఇంకా తెలియదు' అని అన్నాడు. భారత్‌ క్రికెట్‌ జట్టుకు చాలా ప్రశ్నలకు క్లారిటీ లేదు. వాటికి జవాబు వెతకాల్సి ఉంది.   షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌లో ఎవరిని ఆడిస్తారు?.. యువ పేసర్లు నవదీప్ సైని, మొహమ్మద్ సిరాజ్‌ వీరిలో ఎవరిని తీసుకుంటారు?. స్సిన్నర్లలో ఎవరిని ఎంచుకుంటారు?, ఇలా చాలా ప్రశ్నలు టీమిండియా ముందున్నాయి’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.(10 కోట్ల చీర్‌లీడర్‌.. మాక్స్‌వెల్‌ స్పందన)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top