ఆర్‌సీబీ బ్రాండ్‌ విలువ రూ. 2987 కోట్లు | RCB brand value is Rs 2987 crores | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీ బ్రాండ్‌ విలువ రూ. 2987 కోట్లు

Jul 30 2026 4:10 AM | Updated on Jul 30 2026 4:10 AM

RCB brand value is Rs 2987 crores

ప్రపంచంలో అత్యధిక బ్రాండ్‌ వాల్యూ గల క్రికెట్‌ జట్టుగా గుర్తింపు

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్రాండ్‌ వాల్యూలో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ‘హౌలిహాన్‌ లోకే’ నివేదిక ప్రకారం... 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2,874 కోట్లు) బ్రాండ్‌ విలువ దాటిన తొలి క్రికెట్‌ జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. 2025లో తొలిసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు జట్టు బ్రాండ్‌ విలువ 269 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 2575 కోట్లు) కాగా... ఈసారి టైటిల్‌ నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ 16 శాతం వృద్ధితో బ్రాండ్‌ విలువను 312 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2987 కోట్లు)కు పెంచుకుంది.  

ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ 264 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2529 కోట్లు)తో రెండో స్థానంలో ఉంది. మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 245 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2347కోట్లు)తో మూడో స్థానంలో, ఐదుసార్లు ఐపీఎల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ 244 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2337 కోట్లు)తో నాలుగో స్థానంలో ఉన్నాయి.  

ఈ సీజన్‌ ఆరంభానికి ముందే ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్డ్‌వెంచర్స్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌లతో కూడిన కన్సార్టియం 1.78 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 17,000 కోట్లు)కు ఆర్‌సీబీ జట్టును సొంతం చేసుకుంది. అదే సమయంలో ఐపీఎల్‌ కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఐపీఎల్‌ విలువ 11.4 శాతం పెరిగి 20.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.97 లక్షల కోట్లు)కు చేరుకుంది.

వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌ రెండంకెల వృద్ధి నమోదు చేయడం విశేషం. లీగ్‌ స్వతంత్ర బ్రాండ్‌ విలువ 10.3 శాతం పెరిగి 4.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 41,177 కోట్లు)కు చేరింది. ఇక అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ జియో హాట్‌స్టార్‌ లెక్కల ప్రకారం 2026 ఐపీఎల్‌ సీజన్‌కు 106 కోట్ల వీక్షణలు నమోదయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే 7 శాతం వ్యూయర్‌íÙప్‌ పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement