ఆర్సీబీ కెప్టెన్‌ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డు సమం​ | IPL 2026, Rajat Patidars Blistering 21 Ball Half-century In Qualifier 1 At Dharamshala, Scripts Historic IPL Playoff Record | Sakshi
Sakshi News home page

IPL 2026 Playoffs: ఆర్సీబీ కెప్టెన్‌ విధ్వంసం.. వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డు సమం​

May 26 2026 9:30 PM | Updated on May 27 2026 10:43 AM

Rajat Patidars blistering 21-ball half-century in Qualifier 1 at Dharamshala

ఐపీఎల్‌-2026లో ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులు మెరిపించాడు. 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్‌.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.

ధర్మశాల మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాటిదార్‌.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అతడి విధ్వంసం ధాటికి  బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌తో పాటు విరాట్‌ కోహ్లి(43), కృనాల్‌ పాండ్యా(43), పడిక్కల్‌(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్, డ్వేన్ స్మిత్‌ రికార్డును పాటిదార్ సమం చేశాడు. వీరిద్దరూ కూడా 21 బంతుల్లో తమ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.

IPL నాకౌట్‌లు/ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగవంతమైన 50లు (బంతుల పరంగా)
16 సురేష్‌ రైనా vs పంజాబ్ కింగ్స్ (వాంఖడే 2014)
17 ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (సెంచూరియన్ 2009)
20 ఎంస్ ధోని vs ముంబై ఇండియన్స్‌( బెంగళూరు 2012)
21 డ్వేన్ స్మిత్ vs సీఎస్‌కే (ఢిల్లీ 2013)
21 వీరేంద్ర సెహ్వాగ్ vs సీఎస్‌కే (వాంఖడే 2014)
21 రజిత్‌ పాటిదార్ vs పంజాబ్‌ ధర్మశాల 2026 *

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement