హైజంప్‌లో పూజా సింగ్‌ జాతీయ రికార్డు | Pooja Singh Wins Gold Medal At Asian Under-20 Athletics Championship, Surpasses Commonwealth Games Qualification Mark | Sakshi
Sakshi News home page

హైజంప్‌లో పూజా సింగ్‌ జాతీయ రికార్డు

May 30 2026 9:36 AM | Updated on May 30 2026 11:19 AM

Pooja Singh Wins Gold Medal At Asian Under-20 Athletics Championship

హాంకాంగ్‌: ఆసియా అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల హైజంప్‌లో భారత టీనేజర్‌ పూజా సింగ్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా సహన కుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్‌ రికార్డును పూజా సింగ్‌ బద్దలు కొట్టింది. శుక్రవారం జరిగిన హైజంప్‌ ఫైనల్లో పూజా సింగ్‌ 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని సంపాదించింది.

2012లో సహన కుమారి 1.92 మీటర్లతో నెలకొల్పిన జాతీయ సీనియర్‌ రికార్డును పూజ తిరగరాసింది. అంతేకాకుండా కామన్వెల్త్‌ గేమ్స్‌ అర్హత ప్రమాణాన్ని (1.92 మీటర్లు) కూడా ఈ హరియాణా అమ్మాయి అధిగమించింది. గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లోనూ పూజ బంగారు పతకాన్ని సాధించడం విశేషం. మరోవైపు పురుషుల 5000 మీటర్ల రేస్‌ వాక్‌ ఈవెంట్‌లో నితిన్‌ గుప్తా (19ని:47.49 సెకన్లు) భారత్‌కు  పసిడి పతకాన్ని అందించాడు.

మహిళల డిస్కస్‌ త్రోలో అమానత్‌ కంబోజ్‌ బంగారు పతకాన్ని నెగ్గింది. అమానత్‌ డిస్‌్కను 52.24 మీటర్ల దూరం విసిరింది. పురుషుల డెకాథ్లాన్‌లో రాహుల్‌ జాఖడ్‌ 7185 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల ట్రిపుల్‌ జంప్‌లో సాధన దేవి... పురుషుల డెకాథ్లాన్‌లో ఉప్‌కార్‌ రజత పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల విభాగంలో నీరూ పాఠక్‌ కాంస్య పతకాన్ని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement