breaking news
athletic association
-
హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు
హాంకాంగ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల హైజంప్‌లో భారత టీనేజర్ పూజా సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా సహన కుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్ రికార్డును పూజా సింగ్ బద్దలు కొట్టింది. శుక్రవారం జరిగిన హైజంప్ ఫైనల్లో పూజా సింగ్ 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని సంపాదించింది.2012లో సహన కుమారి 1.92 మీటర్లతో నెలకొల్పిన జాతీయ సీనియర్ రికార్డును పూజ తిరగరాసింది. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (1.92 మీటర్లు) కూడా ఈ హరియాణా అమ్మాయి అధిగమించింది. గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లోనూ పూజ బంగారు పతకాన్ని సాధించడం విశేషం. మరోవైపు పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో నితిన్ గుప్తా (19ని:47.49 సెకన్లు) భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు.మహిళల డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ బంగారు పతకాన్ని నెగ్గింది. అమానత్ డిస్‌్కను 52.24 మీటర్ల దూరం విసిరింది. పురుషుల డెకాథ్లాన్‌లో రాహుల్ జాఖడ్ 7185 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో సాధన దేవి... పురుషుల డెకాథ్లాన్‌లో ఉప్కార్ రజత పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల విభాగంలో నీరూ పాఠక్ కాంస్య పతకాన్ని సాధించింది. -
తేజస్విన్‌కు ఎన్సీఏఏ హైజంప్ టైటిల్
భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అమెరికాలో జరిగిన యూనివర్సిటీ గేమ్స్‌లో మెరిశాడు. నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎస్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో 19 ఏళ్ల తేజస్విన్ హైజంప్‌లో స్వర్ణం నెగ్గాడు. కాన్సస్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగి 2.24 మీటర్లతో విజేతగా నిలిచాడు. -
రేపు అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా సెకండరీ పాఠశాల అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న ఉదయం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో ఉంటుందని డీఈఓ అంజయ్య, అసోసియేషన్ కార్యదర్శి సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలల పీఈటీలు ఈ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.


