దేశం మొత్తం గర్విస్తోంది.. నీరజ్‌కు ప్రధాని మోదీ అభినందనలు | PM Modi congratulates Neeraj Chopra for clinching Silver Medal at Paris Olympics | Sakshi
Sakshi News home page

Paris Olympics: దేశం మొత్తం గర్విస్తోంది.. నీరజ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

Aug 9 2024 7:21 AM | Updated on Aug 9 2024 9:36 AM

PM Modi congratulates Neeraj Chopra for clinching Silver Medal at Paris Olympics

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ఖాతాలో తొలి ర‌జ‌త ప‌త‌కం వ‌చ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో భార‌త బ‌ళ్లెం వీరుడు నీర‌జ్ చోప్రా సిల్వ‌ర్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఫైన‌ల్లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీర‌జ్‌.. రెండో స్ధానంలో నిలిచి ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. 

దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 

"నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్‌. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్‌లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్తు భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. రజత పతకం సాధించినందుకు నిరాజ్‌కు అభినందనలు. 

ఎంతో మం‍ది యువ అథ్లెట్‌లకు నీరాజ్ ఆదర్శమని" ఎక్స్‌లో మోదీ ప్రశంసించారు. ఇక ఈ జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. నదీమ్‌ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement