
Serbian Tennis Star Novak Djokovic- న్యూయార్క్: సెర్బియన్ సూపర్‌స్టార్ నొవాక్ జొకోవిచ్ తన మొండివైఖరి వీడట్లేదు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును కోల్పోయిన అతను, కోవిడ్ వ్యాక్సిన్‌కు ససేమిరా అనడంతో ఇప్పుడు అమెరికాలో జరిగే కీలక టోర్నీలకూ దూరమయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజ చాంపియన్ ఇప్పుడు టీకా వ్యతిరేకతతో ప్రముఖ టోర్నీలైన ఇండియన్‌వెల్స్, మయామి, కాలిఫోర్నియా ఈవెంట్లకు దూరమయ్యాడు.
ఇతని ఫామ్ దృష్ట్యా ఇందులో ఎదురయ్యే ప్రత్యర్థులు, సాధించే విజయాలు ఏమంత విషయం కానేకాదు. కానీ వ్యాక్సినేషన్‌కు దూరం కావడంతో ఇప్పుడు టైటిళ్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) నిబంధనల ప్రకారం విదేశీయులెవరైనా తప్పనిసరిగా టీకా తీసుకుంటేనే అమెరికాలో అనుమతిస్తారు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఆడలేదన్న సంగతి తెలిసిందే.
చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!