KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్‌ రాణాకు భారీ షాక్‌

Nitish Rana Has Been Fined 12 Lakh For Slow Over Rate Against PBKS - Sakshi

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్‌ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్‌ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్‌ అర్షదీప్‌ సింగ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్‌.. రింకూ సింగ్‌ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది.  

ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణాకు ఐపీఎల్‌ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శిఖర్‌ ధవన్‌ (47 బంతుల్లో 57;  9 ఫోర్లు,సిక్స్‌), ఆఖర్లో షారుక్‌ ఖాన్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్‌ రాయ్‌ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్‌ రాణా (38 బంతుల్లో 51; ఫోర్‌, సిక్స్‌), ఆండ్రీ రసెల్‌ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్‌ 10 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో కేకేఆర్‌ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది.

చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్‌.. నిన్న రసెల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top