టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన | New Zealand Announce Squad For Womens T20 World Cup 2026, Check Out Full Schedule Details And Names Inside | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన

Apr 29 2026 9:56 AM | Updated on Apr 29 2026 11:08 AM

New Zealand announce squad for Womens T20 World Cup 2026

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 కోసం డిఫెండింగ్ ఛాంపియ‌న్ న్యూజిలాండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ 15 మంది స‌భ్యుల జ‌ట్టులో సూజీ బేట్స్, సోఫీ డివైన్, లీ తహుహు వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌కు చోటు ద‌క్కింది. వీరు ముగ్గురు ఈ మెగా టోర్నీ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కనున్నారు.

ఇక స్టార్ ఆల్‌రౌండ‌ర్ అమీలియా కెర్ తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో వైట్ ఫెర్న్స్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించేందుకు సిద్ద‌మైంది. నెన్సి పటెల్, జార్జియా ప్లిమ్మ‌ర్ వంటి యంగ్ ప్లేయ‌ర్స్‌కు సెలెక్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదిక‌గా ప్రారంభం కానుంది.

కివీస్ త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 13న వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచి, తమ దిగ్గ‌జాల‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని న్యూజిలాండ్‌ పట్టుదలతో ఉంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి కివీస్ జ‌ట్టు ఇదే
అమెలీయా కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్‌మేరీ మేర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూపులు ఇవే
గ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్

న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే
న్యూజిలాండ్ వ‌ర్సెస్ వెస్టిండీస్ (13-06-2026)
న్యూజిలాండ్ వ‌ర్సెస్ శ్రీలంక‌(16-06-2026)
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఐర్లాండ్‌(19-06-2026)
న్యూజిలాండ్ వ‌ర్సెస్ స్కాట్లాండ్‌(23-06-2026)
న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇంగ్లండ్‌(27-06-2026)
చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement