One-Off Test: Najmul Hossain Shanto records twin centuries against Afghanistan - Sakshi
Sakshi News home page

#NajmulHossainShanto: ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్‌

Jun 16 2023 11:52 AM | Updated on Jun 16 2023 12:28 PM

Najmul Hossain Shanto Record-Twin Centuries Vs-Afghanistan Only-Test - Sakshi

అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హొసెన్‌ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న షాంటో ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో నజ్ముల్‌ షాంటో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరపున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకముందు మోమినుల్‌ హక్‌ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో అఫ్గానిస్తాన్‌ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఇ‍క ఓవరాల్‌ టెస్టు క్రికెట్‌ జాబితాలో నజ్ముల్‌ హొసెన్‌ షాంటో 91వ క్రికెటర్‌గా నిలిచాడు.

ఇక టెస్టు మ్యాచ్‌ విషయానికి వస్తే బంగ్లాదేశ్‌ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్‌ అయిన ఆఫ్గన్‌ను ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న బంగ్లా మూడోరోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. షాంటో 112, మోమినుల్‌ హక్‌ 43 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 491 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్‌ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: షేన్‌ వార్న్‌ బయోపిక్‌.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement