రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ షమీ సోదరుడు, బెంగాల్ పేసర్ మహ్మద్ కైఫ్.. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అగర్తల వేదికగా త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో 28 ఏళ్ల కైఫ్ సత్తాచాటాడు. తన అన్న షమీ కంటే అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
మహ్మద్ కైఫ్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 19 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. 53 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టాపార్డర్ బ్యాటర్లు బిక్రం కుమార్ దాస్, శ్రీదాం పాల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన కైఫ్.. బిక్రంజిత్ దేబ్‌నాథ్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.
కైఫ్‌పై నమ్మకంతో బెంగాల్ కెప్టెన్ అభిషేక్ పోరెల్ మూడో రోజు ఆటలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతడు అన్న షమీ అయితే 19 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ సాధించకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు. 78 ఓవర్లు ముగిసేసరికి త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. క్రీజులో హనుమా విహారి(121), మణిశంకర్ మురాసింగ్(42) ఉన్నారు. బెంగాల్ బౌలర్లలో కైఫ్‌తో పాటు, ఇషాన్ పోరెల్, షాబాజ్ అహ్మద్, రాహుల్ ప్రసాద్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
కాగా కైఫ్ బెంగాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యుడు కాదు. 28 ఏళ్ల కైఫ్ కేవలం 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లే ఆడాడు. 18 ఇన్నింగ్స్‌లలో అతడు 34 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ అయితే 20 ఏళ్లకే ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి.. నాలుగేళ్లు తిరిగక ముందే భారత్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు.
చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్‌లు..
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
