పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2025-26 సీజన్‌కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రిజ్వాన్ తిరష్కరించినట్లు సమాచారం. మొత్తం 30 మంది క్రికెటర్లలో రిజ్వాన్ ఒక్కడే సెంట్రాక్ట్ కాంట్రాక్ట్ పేపర్లపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
తనను టీ20 జట్టు నుంచి తప్పించడంతో రిజ్వాన్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పాక్‌కు చెందిన జియో 'జియో సూపర్' తమ కథనంలో పేర్కొంది. అయితే బోర్డు ముందు రిజ్వాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సదరు వెబ్‌సైట్ వెల్లడించింది.
తన డిమాండ్లను నెరవేరిస్తానే కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తానని రిజ్వాన్ తెలిపాడంట. పీసీబీ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో రిజ్వాన్ కేటగిరీ బిలో ఉన్నారు. స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం కూడా ఇదే కేటగిరీలో ఉన్నాడు. గతంలో వీరిద్దరూ కేటగిరీ ఎలో ఉండేవారు. కానీ పీసీబీ ఈసారి పూర్తి కేటగిరీ ఎనే తొలిగించింది.
కాగా రిజ్వాన్‌ను తాజాగా పాక్ జట్టు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పాక్ జట్టుకు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది జట్టుకు నాయకత్వం వహించాడు. రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ 20 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి, 11 ఓటములను చవిచూసింది.
కెప్టెన్‌గా అతడి విజయ శాతం 45గా ఉంది. గతేడాది అక్టోబర్‌లో బాబర్ ఆజం నుంచి రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ నాయకుడిగా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిపై పీసీబీ వేటు వేసింది.
పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా ఇదే
కేటగిరీ B
అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది.
కేటగిరీ C
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమాన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్.
కేటగిరీ D
అహ్మద్ డానియల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సూఫియాన్ మొకీమ్.
చదవండి: శ్రేయస్ అయ్యర్ గాయంపై బీసీసీఐ మరో అప్‌డేట్


