ఐపీఎల్ 2026 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్ మధుషంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది.
లంక క్రికెట్ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.
NEWS 🚨
Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026
శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్‌లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.
వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్‌కు వచ్చి ఎస్‌ఆర్‌హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.
ఈ ముగ్గురు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్ ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది.
దీంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు మలింగ లాంటి బౌలర్ ఒక్క మ్యాచ్‌కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.
మలింగ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్‌లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్‌కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.
కాగా, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్, ఆర్సీబీ టాప్-2లో ఉన్నాయి.


