
కొద్ది రోజుల కిందట ఆసియా కప్ 2025 ట్రైనింగ్ సెషన్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన "Richard Mille RM 27-04 Tourbillon" చేతి గడియారం (వాచ్) క్రికెట్ అభిమానులనే కాక యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ వాచ్ విలువ రూ.20 కోట్లకు పైబడి ఉంటుంది. ఇది ఆసియా కప్ ప్రైజ్ మనీతో (రూ.2.6 కోట్లు) ఎనిమిది రెట్లు ఎక్కువ.
ఈ లిమిటెడ్ ఎడిషన్ టైమ్‌పీస్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే తయారు చేయబడ్డాయి. ఈ లగ్జరీ చేతి గడియారం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నదాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ టైమ్‌పీస్ ప్రత్యేకతలు ఏమిటంటే..
- 30 గ్రాముల బరువు మాత్రమే, స్ట్రాప్‌తో సహా
- 12,000 g’s వరకు షాక్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది రికార్డు స్థాయి
- టెన్నిస్ రాకెట్ స్ట్రింగ్‌ల ప్రిన్సిపుల్ ఆధారంగా రూపొందించిన స్టీల్ మెష్
- TitaCarb® అనే అత్యాధునిక పాలిమర్‌తో తయారైన కేస్
- 38.5% కార్బన్ ఫైబర్ కలిగి ఉండి, అత్యధిక బలాన్ని కలిగిస్తుంది
కాగా, వాచ్‌ల పిచ్చి ఉన్న హార్దిక్ పాండ్యా గతంలో Richard Mille RM 27-04 Tourbillon కంటే చాలా రెట్లు ఖరీదైన Patek Philippe Nautilus Travel Time Blue Diamond వాచ్‌ను ధరించాడు. దీని విలువ రూ. 43.83 కోట్లు ఉంటుందని అంచనా. హార్దిక్ వద్ద రూ.7 కోట్ల విలువైన RM 27-02 వాచ్ కూడా ఉంది.
హార్దిక్ తర్వాత భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన వాచ్‌ను విరాట్ కోహ్లి ధరించాడు. కోహ్లి ఓ సందర్భంలో రూ. 4.36 కోట్ల విలువైన Rolex Daytona Rainbow Everose Gold మోడల్‌ను ధరించాడు.
క్రీడా ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన వాచ్‌ను ధరించిన ఘనత బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మెవెదర్‌ను దక్కుతుంది. మెవెదర్ ఓ సందర్భంలో Jacob & Co. Billionaire వాచ్ ధరించాడు. దీని విలువ రూ. 150 కోట్లు. దీన్ని 260 కారెట్ల డైమండ్లతో ప్రత్యేకంగా తయారు చేశారు.
కాగా, ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.