వైభవ్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ఓవరాక్షన్‌ చేసిన ఢిల్లీ బౌలర్‌ | Kyle Jamieson Shouts At Vaibhav Sooryavanshi On His Face | Sakshi
Sakshi News home page

వైభవ్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ఓవరాక్షన్‌ చేసిన ఢిల్లీ బౌలర్‌

May 1 2026 8:26 PM | Updated on May 1 2026 8:42 PM

Kyle Jamieson Shouts At Vaibhav Sooryavanshi On His Face

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది.

ఆదిలోనే షాక్‌లు
తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4) బంతుల వ్యవధిలో ఔటయ్యారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదిన జైస్వాల్‌.. మూడో బంతికి స్టార్క్‌ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు.

7 బంతుల తర్వాత వైభవ్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్‌.. ఆతర్వాత బంతికే జేమీసన్‌ వేసిన అద్భుతమైన యార్కర్‌కు దొరికాడు. ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న వైభవ్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో జేమీసన్‌ ఓవరాక్షన్‌ చేశాడు.

ముఖానికి దగ్గరగా వెళ్లి ఆరుస్తూ, చప్పట్లు కొట్టాడు. జేమీసన్‌ చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడి పట్ల ఈ ప్రవర్తన సరికాదని అంటున్నారు.

బీసీసీఐ చర్య తీసుకుంటుందా..?
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా లేదా బెదిరించేలా ప్రవర్తిస్తే మ్యాచ్ రిఫరీ చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణ ఆగ్రహావేశ సెలబ్రేషన్‌గా పరిగణిస్తారా, లేక కోడ్ ఉల్లంఘనగా భావిస్తారా అన్నది మ్యాచ్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్స్‌ 10.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును తాకింది. జైస్వాల్‌, సూర్యవంశీ ఔట్‌ కాగా.. జురెల్‌ (35), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (54) క్రీజ్‌లో ఉన్నారు.

తుది జట్లు..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement