బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు.. విజ‌యం మాదే: కేఎల్‌ రాహుల్‌ | KL Rahul promises blockbuster finish after Englands bold Day 5 prediction | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు.. విజ‌యం మాదే: కేఎల్‌ రాహుల్‌

Jun 24 2025 9:05 AM | Updated on Jun 24 2025 9:09 AM

 KL Rahul promises blockbuster finish after Englands bold Day 5 prediction

హెడింగ్లీ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. అద‌నంగా 274 ప‌రుగులు జోడించి త‌మ రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో  కేఎల్ రాహుల్ (137), రిష‌బ్ పంత్ (118) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

పంత్‌, రాహుల్ ఇద్ద‌రూ నాలుగో వికెట్‌కు 195 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్ద‌రూ ఔట‌య్యాక టీమిండియా బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 31 పరుగుల వ్యవధిలోనే  భార‌త్‌ చివరి 6 వికెట్లు కోల్పోయింది.

దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి ఇంగ్లండ్ ముందు 371 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపింది.  ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లు పెట్టిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజ‌యంపై సెంచూరియాన్ కేఎల్ రాహుల్ థీమా వ్య‌క్తం చేశాడు.

ఆఖ‌రి రోజు ఆట‌లో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తామ‌ని రాహుల్ తెలిపాడు. మ‌రోవైపు ఇంగ్లండ్ సైతం డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ యువ సంచ‌ల‌నం జోష్ టంగ్ స్ప‌ష్టం చేశాడు.

"బ్లాక్‌బ‌స్ట‌ర్ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాము. ఖ‌చ్చితంగా ఈ మ్యాచ్ ఫ‌లితం తేలుతుంది. ఇంగ్లండ్ జ‌ట్టు కూడా  డ్రా కోసం కాకుండా విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ విష‌యాన్ని వారు బహిరంగంగానే వెల్ల‌డించారు. కాబ‌ట్టి వారు దూకుడుగా ఆడితే మాకు 10 వికెట్లు తీసేందుకు అవ‌కాశం ల‌భిస్తోంది. 

నాలుగో రోజు ఆట‌లో పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. బంతి కాస్త ఆగి వ‌చ్చింది.  రేపు(మంగ‌ళ‌వారం) పిచ్‌ మ‌రింత ట్రిక్కీగా మార‌వ‌చ్చు. దీంతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని నాలుగో రోజు ఆట అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
 

Advertisement
 
Advertisement
Advertisement