కావ్యా మారన్ (PC: BCCI/IPL)
వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.
ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ నుంచి సన్‌రైజర్స్‌కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, అనూహ్య రీతిలో సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్ విధ్వంసకరవీరుడు వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపడంలో ఎస్‌ఆర్‌హెచ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.
ఆ సమయంలో సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రఫుల్ ఊహించని రీతిలో బ్రేక్ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay
— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026
ఇక వైభవ్‌తో పాటు రాజస్తాన్ కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను కూడా ప్రఫుల్ హింగే వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి.
It's all Orange in Hyderabad 🧡
A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️
They end #RR's unbeaten streak this season 👏
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026


