సినెర్‌ ‘కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌’ ఘనత | Jannik Sinner completes Career Golden Masters | Sakshi
Sakshi News home page

సినెర్‌ ‘కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌’ ఘనత

May 18 2026 5:54 AM | Updated on May 18 2026 5:54 AM

Jannik Sinner completes Career Golden Masters

రోమ్‌: ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ పురుషుల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ ‘కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌’ ఘనత పూర్తి చేశాడు. ‘మాస్టర్స్‌ సిరీస్‌–1000’లో భాగంగా జరిగే తొమ్మిది వేర్వేరు టోర్నిలన్నింటిలో (మయామి, మాడ్రిడ్, మోంటెకార్లో, ఇండియన్‌ వెల్స్, రోమ్, పారిస్, షాంఘై, సిన్సినాటి, కెనడా) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా సినెర్‌ నిలిచాడు. 

స్వదేశంలో ఆదివారం ముగిసిన రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో టాప్‌ సీడ్‌ సినెర్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో జరిగిన ఫైనల్లో సినెర్‌ 6–4, 6–4తో గెలుపొందాడు. సినెర్‌కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 23 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

సినెర్‌ కెరీర్‌లో ఇది 10వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ కావడం విశేషం. మయామి ఓపెన్‌ను రెండుసార్లు నెగ్గిన సినెర్‌.. మిగతా ఎనిమిదింటిని ఒక్కోసారి సాధించాడు. 1990లో ‘మాస్టర్స్‌ సిరీస్‌’ మొదలుకాగా... ఇప్పటి వరకు సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రమే (రెండుసార్లు; 2018లో, 2020లో) ‘కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌’ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా జొకోవిచ్‌ తన కెరీర్‌లో 40 మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement