‘ఇదొక భయంకరమైన పవర్‌ ప్లే’

It Was A Terrible Powerplay Stephen Fleming - Sakshi

షార్జా: ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే 115 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించగా, ముంబై 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. సామ్‌ కరాన్‌(52) మినహా అంతా విఫలం కావడంతో చెన్నై ఘోరపరాభవాన్ని చవిచూసింది. పవర్‌ ప్లే ముగిసేసరికి సీఎస్‌కే ఐదు వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోరుకు పరిమితమైంది. అదే సమయంలో ఐపీఎల్‌ చరిత్రలో పవర్‌ ప్లేలో సీఎస్‌కే  ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. (వరుణ్‌ పాంచ్‌ పటాకా.. కేకేఆర్‌ ‘సిక్సర్‌’)

అయితే మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘ మా ప్రదర్శన మాకే ఆశ్చర్యం కల్గించింది. ఇదొక భయంకరమైన పవర్‌ ప్లే. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. అదే కూడా పవర్‌ ప్లే ముగిసే సరికి సగం వికెట్లను చేజార్చుకున్నాం. పవర్‌ ప్లేలో గేమ్‌ దాదాపు ముగిసింది. ఈ మ్యాచ్‌ను చూడటం కష్టతరమైంది. మేము కొంతమంది యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాం. అది వర్కౌట్‌ కాలేదు’ అని ఫ్లెమింగ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ముంబై బౌలింగ్‌ యూనిట్‌పై ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురిపించాడు. ‘ముంబై బౌలర్లంతా అసాధారణమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అనే దానికి దారులు కనుగొన్నాం. మ్యాచ్‌కు ముందు ఇది కీలకమైన మ్యాచ్‌ అని భావించాం. కానీ పూర్తిగా తేలిపోయాం. ఈ గేమ్‌లో మా బౌలింగ్‌ యూనిట్‌ బాగుంది. కానీ సరిపడా పరుగులు బోర్డుపై ఉంచకపోవడంతో దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మాకు కొంత ఆశ మాత్రమే ఉంది. మ్యాచ్‌లో ఓటమి ముందే ఖరారై పోయింది’ అని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top