చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు నలుగురు 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆ జట్టు చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. గత ఎడిషన్ ఆరంభంలో తొలిసారి ఇలా జరిగింది.
సాధారణంగా సీఎస్‌కేను ముసలివాళ్ల జట్టుగా పరిగణిస్తారు. ఆ జట్టు చరిత్ర చూస్తే 30 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా సీఎస్‌కే ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది.
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్ లాంటి యువకులను సీఎస్‌కే బరిలోకి దించింది. వీరంతా 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు.
ఆయుశ్ మాత్రే (18 ఏళ్ల 261 రోజులు)
కార్తీక్ శర్మ (19 ఏళ్ల 342 రోజులు)
ప్రశాంత్ వీర్ (20 ఏళ్ల 130 రోజులు)
నూర్ అహ్మద్ (21 ఏళ్ల 90 రోజులు)
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ చివరి బంతికి సంజూ శాంసన్ (7) ఔటయ్యాడు. సీఎస్‌కేకు మారిన తర్వాత సంజూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 24-1గా ఉంది. ఆయుశ్ మాత్రే (0), రుతురాజ్ గైక్వాడ్ (11) క్రీజ్‌లో ఉన్నారు.


