సీఎస్‌కేపై పంజాబ్‌ గెలుపు | IPL 2026 Match 7: CSK VS PUNJAB KINGS Updates | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేపై పంజాబ్‌ గెలుపు

Apr 3 2026 7:02 PM | Updated on Apr 3 2026 11:26 PM

IPL 2026 Match 7: CSK VS PUNJAB KINGS Updates

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. పంజాబ్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
8.5వ ఓవర్‌-95 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. లేని రెండో పరుగుకు ప్రయత్నించి ప్రభ్‌సిమ్రన్‌ (43) రనౌటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
210 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన తర్వాత పంజాబ్‌ 61 పరుగుల వద్ద (4.2వ ఓవర్‌) తొలి వికెట్‌ కోల్పోయింది. విధ్వంసం సృష్టించిన ప్రియాంశ్‌ ఆర్యను (39) మ్యాట్‌ హెన్రీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

సీఎస్‌కే భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.  

ఐదో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
16.4వ ఓవర్‌- 168 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఔటయ్యాడు.

మాత్రే (73) ఔట్‌
12.3వ ఓవర్‌-123 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ మాత్రే ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
11.1వ ఓవర్‌- 110 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో నేహల్‌ వధేరాకు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) ఔటయ్యాడు. 

భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న సీఎస్‌కే
టాస్‌ ఓడి తొలుత బ్యాటంగ్‌ చేస్తున్న సీఎస్‌కే భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ వికెట్‌ కోల్పోయినా.. ఆయుశ్‌ మాత్రే (62) ధాటిగా ఆడుతుండటంతో 10 ఓవర్లలో వికెట​్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మాత్రే తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతనికి రుతురాజ్‌ (25) సహకరిస్తున్నాడు. 

సంజూ మరోసారి విఫలం
సీఎస్‌కే మారిన తర్వాత సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులకు ఔటైన అతను.. ఇవాల్టి మ్యాచ్‌లో మరో పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సీఎస్‌కే ఓ మార్పు చేసింది. మాథ్యూ షార్ట్‌ స్థానంలో ప్రశాంత్‌ వీర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్‌: సూర్యాంశ్ షెడ్గే, ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బ్రార్

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ సబ్స్: జామీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement