రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు | IPL 2026, Match 43: Rajasthan Royals Vs Delhi Capitals Updates And Highlights | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు

May 1 2026 7:02 PM | Updated on May 1 2026 11:28 PM

IPL 2026, Match 43: Rajasthan Royals Vs Delhi Capitals Updates And Highlights

రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు
226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (62), కేఎల్‌ రాహుల్‌ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్‌ రాణా (33), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (26 నాటౌట్‌) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. 

నిస్సంక హాఫ్‌ సెంచరీ
6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 70-0గా ఉంది. నిస్సంక (50), కేఎల్‌ రాహుల్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. 

రాజస్థాన్‌ భారీ స్కోర్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. రియాన్‌కు కాసేపు జురెల్‌ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్‌ ఫెరియెరా గత మ్యాచ్‌ తరహాలో చెలరేగిపోయాడు. 

కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4), షుభమ్‌ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. 

రియాన్‌ పరాగ్‌ (90) ఔట్‌
16.4వ ఓవర్‌- సెంచరీకి చేరువైన తరుణంలో భారీ షాట్‌ ఆడబోయి రియాన్‌ పరాగ్‌ (90) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 173-5గా ఉంది.

జురెల్‌ (42) ఔట్‌
11.4వ ఓవర్‌- 114 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి జురెల్‌ (42) ఔటయ్యాడు.

సూర్యవంశీ (4) ఔట్‌
1.5వ ఓవర్‌- జేమీసన్‌ బౌలింగ్‌లో వైభవ్‌ సూర్యవంశీ (4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

మూడో బంతికే వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ మూడో బంతికే వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ అద్భుతమైన బంతితో యశస్వి జైస్వాల్‌ను (6) క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే జైస్వాల్‌ సిక్సర్‌ బాదాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది. 

తుది జట్లు..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement