ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.
శ్రేయస్ ఔట్
12.1వ ఓవర్- 110 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (18) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) ఔటయ్యాడు.
ఆదిలోనే పంజాబ్‌కు ఎదురుదెబ్బ
1.2వ ఓవర్- 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రబాడ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు.
స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
15.4వ ఓవర్- 129 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (38) పెవిలియన్ బాట పట్టాడు.
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్
13.6వ ఓవర్- 119 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి గ్లెన్ ఫిలిప్స్ (25) ఔటయ్యాడు.
గిల్ ఔట్
9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (39) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సుదర్శన్ (13) ఔట్
3.4వ ఓవర్- 37 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ ఔటయ్యాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్‌పూర్) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్ వేదికగా గత ఎడిషన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు..
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే
గుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా


