ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది.
ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్ పోరాడటంతో సీఎస్‌కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో ఆదిలోనే రాయల్స్ గెలుపును ఖరారు చేశాడు.
యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. మధ్యలో జురెల్ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.


